08-04-2025 12:58:54 AM
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 7 ( విజయ క్రాంతి ) : వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 59 అర్జీలను స్వీకరించారు.
అందులో రెవిన్యూ శాఖ 38, మున్సిపాలిటీ 7, జిల్లా పంచాయతీ శాఖ 7, వైద్య శాఖ 2, సర్వే ల్యాండ్స్ , విద్య , వ్యవసాయ, హౌసింగ్, లీడ్ బ్యాంకు, శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని అన్నారు. అనంతరం మన జిల్లాకు సంబంధించి స్టేట్ ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి డిస్పోజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రూ.500 బోనస్ వాల్ పోస్టర్ విడుదల
2024..25 సంవత్సరంలో వరి పంటకు ప్రకటించబడిన కనీస మద్దతు ధర, సన్నధాన్యానికి ప్రోత్సాహంగా కింటాకు రూ 500 లు గల బోనస్ వాల్ పోస్టర్లను రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి విడుదల చేశారు. ఆయనతో పాటు జెడ్పిసిఓ శోభారాణి, మార్కెటింగ్ శాఖ అధికారి సబితా, జిల్లా పంచాయతీ అధికారి సునందలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.