11-03-2025 09:16:08 PM
ఎస్పీ రాజేష్ చంద్ర...
కామారెడ్డి (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి వారికి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మంగళవారం భిక్కనూరు పోలీస్ స్టేషన్ ను విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ ఆఫీసర్లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతించారు. అనంతరం ఆయన ఎస్ఐ కార్యాలయంలోని రిసెప్షన్ తో పాటు, కార్యాలయంలోని ఛాంబర్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేయాలని సూచించారు. కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ సమయానికి అనుగుణంగా డ్యూటీ లు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించే విధంగా చూడాలని సూచించారు. స్టేషన్ సిబ్బందిని కొత్త ఎస్పీకి పరిచయం చేశారు. ఆయన వెంట భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్ ఐ డి ఆంజనేయులు ఉన్నారు.