calender_icon.png 16 January, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇమ్లీబన్, మెట్రో జంక్షన్ మూసీలోనే ఉన్నయ్

02-09-2024 01:09:50 AM

  1. హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి హైడ్రామా
  2. బందిపోట్లలా వ్యవహరిస్తున్న హైడ్రా 
  3. ఎంపీ ఈటల రాజేందర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ఇమ్లీబస్ స్టేషన్, ఎంజీబీఎస్ మెట్రో జంక్షన్ మూసీ నదిలోనే ఉన్నాయని  బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్  అన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీ సులో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల జీవితాల్లో  రేవంత్ రెడ్డి  ప్రభుత్వం మట్టి పోసిందని మండిపడ్డారు. హైడ్రాపై పేదలు అడిగే ప్రశ్నలకి సీఎం కు సమాధానం చెప్పే దమ్ము ఉందా అని నిలదీశారు.

హైడ్రా సమాజ హి తం కోసం కాదని ఆయన పేర్కొన్నా రు. సరూర్‌నగర్ చెరువు వద్ద సింగరే ణి కాలనీని ప్రభుత్వమే లేఅవుట్ చేసి ఇచ్చిందనే విషయాన్ని మరిచిపోయా రా అని ప్రశ్నించారు. ఇప్పటికీ రాజ్ భవన్ వద్ద వర్షం వస్తే పడవలు వేసుకునే పరిస్థితి ఉందన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, పేదలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. కావాలంటే పేదలకు ఇండ్లు కట్టించి రేవంత్ మాట్లాడాలని ఆయన సూచించారు. రేవంత్ రెడ్డి గురించి మొత్తం తనకు తెలుసని, కానీ తాను వ్యక్తిగతంగా ఎవరినీ నిందించబోనని ఈటల వ్యాఖ్యానించారు. 

రాష్ర్టం ఇప్పుడే ఏర్పడినట్లు, తానే కొత్త సీఎం అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన  చురకలంటించారు. ఎన్ కన్వెన్షన్ ఒకటి కూల్చి ఆ పేరుతో పేద ల ఇండ్లు కూలుస్తున్నారని ఈటల అన్నారు. అల్వాల్‌లో 56 ఏండ్లుగా ఉంటున్న 200 మందికి నోటీసులు ఇచ్చి హైడ్రా చిచ్చు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఏ పార్టీలు అధికారంలో ఉన్నపుడు అనుమతులు ఇచ్చారో రేవంత్ రెడ్డికి తెలియదా అని  ప్రశ్నించారు. శనివారం, ఆదివారం కోర్టులు ఉండవు కాబట్టి, ఆరోజుల్లోనే దొంగ లు, బందిపోట్లలా వచ్చి హైడ్రా విధ్వంసాలకు పాల్పడుతోందన్నారు. పేదల ఇళ్లను కూలిస్తే ఖబర్ధార్ అంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు.  బీజేపీ ప్రజల పక్షాన ఉంటుంది. న్యాయపోరాటం కూడా చేస్తుందని తెలిపారు.