calender_icon.png 9 October, 2024 | 1:52 AM

కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరిస్తారు

04-10-2024 12:17:23 AM

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేశ్ అగస్త్య నటిస్తున్న సినిమా ‘కలి’. ఈ చిత్రాన్ని ప్రముఖ కథా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శివశేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో వరుణ్‌తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కలి” సినిమా ఈవెంట్‌కు హాజరవడం సంతోషంగా ఉంది. ప్రిన్స్ నాకు క్లోజ్ ఫ్రెండ్. డెడికేషన్ ఉన్న నటుడు. హీరోగా చేస్తూనే మంచి రోల్స్ వస్తే డీజే టిల్లు, స్కంధ లాంటి మూవీస్‌లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అలాంటి క్యారెక్టర్స్‌తో ప్రిన్స్‌కు మంచి గుర్తింపు వచ్చింది. నా మూవీస్‌లో కూడా నటించాడు.

మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ‘కలి’కి కూడా ఆడియెన్స్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్‌” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేశ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, దర్శకులు బలగం వేణు, మల్లిక్ రామ్, హీరోలు హీరో ప్రిన్స్, ఆకాశ్ జగన్నాథ్, హీరోయిన్ నేహాకృష్ణన్, చిత్ర దర్శకుడు శివశేషు, సమర్పకులు కె.రాఘవేంద్రరెడ్డి, నిర్మాత లీలా గౌతమ్ వర్మ, డీవోపీ డానీ, నటులు ప్రియదర్శి, మహేశ్ విట్ట పాల్గొన్నారు.