calender_icon.png 17 January, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను రెడీ.. నువ్వు సిద్ధమా?

17-01-2025 01:02:56 AM

* రేవంత్.. లైడిటెక్టర్ పరీక్షకు ఓకేనా 

* సీఎంకు సంక్రాంతి ఆఫర్ ఇస్తున్నా

* అవినీతే జరగని కేసులో పైసలు వృథా

* ఏసీబీ 80 అడిగితే ఈడీ 40 ప్రశ్నలు 

* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): తాను ఏ తప్పు చేయలేదని, భవిష్యత్‌లో కూడా చేయబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఫార్ములా ఈ రేసులో అరపైసా అవినీతి జరగలేదని, తప్పు చేసినట్టు రుజువు చేస్తే తాను ఏ శిక్షకైనా రెడీ అని తేల్చి చెప్పారు. తనపై ఉన్న ట్టే, సీఎం రేవంత్ రెడ్డిపైనా ఈడీ, ఏసీబీ కేసు లు ఉన్నాయని, ఎవరు తప్పు చేశారో తేల్చడానికి తాను లైడిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమని, ఇదే ప రీక్షకు సీఎం రెడీనా? అంటూ సవాల్ విసిరా రు.

గురువారం ఈడీ విచారణ ముగిసిన అ నంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్ కేసులో తనను, ఓటుకు నోటు కేసులకు సంబంధించి రేవంత్‌రెడ్డిని లైడిటెక్టర్ సాయంతో ప్రశ్నిస్తే దొంగెవ రో? దొరెవరో? ఎవరి నిజాయితీ ఎంటో తేలిపోతుందని అన్నారు.

రేవంత్‌రెడ్డి ప్యాలెస్‌లో అయినా ఈడీ ఆఫీస్‌లో అయినా, న్యాయమూర్తి ముందైనా ..ఎక్కడైనా విచారణకు తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డికి తాను ఇస్తున్న సంక్రాంతి ఆఫర్ ఇదేనని అన్నారు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే తనతోపాటు టెస్ట్‌కు రావాలని డిమాండ్ చేశారు.  

ఏసీబీ 80.. ఈడీ 40 ప్రశ్నలు 

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసు పెట్టనట్టు కేటీఆర్ ఆరోపించారు. అధికారులు, విచారణ సంస్థలను గౌరవించి ఈనెల 9న ఏసీబీ, ఇప్పుడు ఈడీ విచారణకు వచ్చినట్టు స్పష్టంచేశారు.  రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని తానని పునరుద్ఘాటించారు. ఏసీబీ 80 ప్రశ్నలు అడిగితే ఈడీ 40ప్రశ్నలు అడిగిందని..  రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలను అడిగి వివరాలను తీసుకున్నాయని చెప్పారు.

ఈ రెండు సంస్థలకు తాను ఒకటే మాట చెప్పానని, విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని, పూర్తిగా విచారణకు సహకరిస్తానని స్పష్టంచేశారు. పారదర్శకంగా నిధుల బదిలీ అయినప్పుడు మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందని ఏసీబీ, ఈడీ అధికారులను తాను అడిగినట్టు కేటీఆర్ తెలిపారు. అంతిమంగా న్యాయం, ధర్మం, నిజాయితీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

పైసలు వృథా ఎందుకు?

తనపై నమోదు చేసిన కేసు విచారణకు రూ.10 కోట్లు ఖర్చు అవుతుందని పేపర్లలో రాస్తున్నారని.. అవినీతే జరగని ఈ కేసులో అన్ని పైసలను వృథా చేయడం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ డబ్బులతో రైతు రుణమాఫీ లేదా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని హితవు పలికారు. లైడిటెక్టర్ టెస్ట్ అయితే రూ.50 లక్షల్లో మొత్తం తేలిపోతుందని చెప్పారు.

పరీక్ష ఎక్కడ నిర్వహించాలో తేదీ, సమయం రేవంత్‌రెడ్డే నిర్ణయించాలని సూచించారు. రేవంత్‌రెడ్డిపై ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి తనపై ఏసీబీ కేసును పెట్టించారని, అలాగే ఆయనపై ఈడీ కేసు ఉన్నదని తనపై ఈడీతో విచారణ జరిపిస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని,  భవిష్యత్‌లో నిజాలు తెలుస్తాయన్నారు.