calender_icon.png 2 April, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలాంటి కథతో సినిమాలు రాకపోవడం నా అదృష్టం

30-03-2025 12:00:00 AM

‘పొలిమేర’ చిత్రంతో మంచి గుర్తిం పు తెచ్చుకున్నారు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన తొలి సినిమా ‘28 డిగ్రీ సెల్సియస్’. ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా లో నవీన్‌చంద్ర హీరోగా, షాలినీ వడ్నికట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 4న థియేటర్ల ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ మీడియాతో చిత్రవిశేషాలను పంచుకున్నారు. “28 డిగ్రీ సెల్సియస్’ సినిమాతో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది.

2017లో ప్రారంభించాం.  క్వాలిటీ పరంగా రాజీ పడకపోవడంతో బడ్జెట్ పెరిగింది. థియేటర్లలో రిలీ జ్ చేసుకోవాలనే కోరిక ఉండేది. ఇప్పుడు రిలీజ్ నా మంచికే అని భావిస్తా.  ఇద్దరు మెడికల్ స్టూడెం ట్స్ మధ్య జరిగే ప్రేమకథ ఇది. మెడికల్‌గా 28 డిగ్రీ సెల్సియస్ అనే అంశాన్ని కథలో మిక్స్ చేశాం. బ్రెయిన్ డ్యామేజ్ అయినవారు ఎక్కువ వేడి, చల్లదనం తట్టుకోలేరు. అది థియరీగా ఉంది. ఈ అంశా న్ని సినిమా కోసం ఎఫెక్టివ్‌గా ఉపయోగించాం. జార్జియాలో 25 రోజులు షూటింగ్ చేశాం. ఆ షెడ్యూ ల్ కోసం మేము పడిన కష్టం మాటల్లో చెప్పలేను. రెండుసార్లు అక్కడి అధికారులు తిరిగి పంపేశారు. థర్డ్ టైమ్ కెమెరా కిట్స్ ఉన్న బ్యాగులు పోయాయి.

జార్జియాలో వాటిని కొని షూటింగ్ చేశాం.  ఈ మూవీ రిలీజ్ ఆగిపోయినప్పుడు నా పర్సనల్, ప్రొఫెషనల్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ఈ మూవీ లో నేను కూడా పెట్టుబడి పెట్టాను. ఆత్మహత్య ఆలోచనలు కూడా కలిగేవి. అయితే బతికే సాధించాలనే పట్టుదలతో పొలిమేర స్క్రిప్ట్ చేసుకుని ఆ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో పొలిమేర2 చేశాను. ఇప్పుడు థర్డ్ పార్ట్ చేస్తున్నాం. పొలిమేరతో వచ్చిన గుర్తింపుతో ఈ సినిమా బాగా రిలీజ్ అవుతుందని నమ్ముతున్నా. సినిమా రిలీజ్ కావడం ఆలస్యమైంది. అయితే అదృష్టవశాత్తూ ఇలాంటి కథతో మరే మూవీ థియేటర్లు, ఓటీటీలో రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే చాలా బాధపడేవాడిని. నేను యూనిక్ బ్యాక్‌డ్రాప్స్‌తో కథలు రాస్తాను. అదే నాకు అడ్వాంటేజ్‌గానే భావిస్తా” అన్నారు.