calender_icon.png 24 February, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్దె ఇల్లు కావాలంటూ పీక పిసికి...

18-02-2025 01:05:22 AM

  • 12తులాల బంగారం లాక్కెళ్లిన ముసుగు కి“లేడీలు”.!

సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా రంగంలోకి పోలీసులు 

అచ్చంపేటలో బుర్ఖా దొంగల బీభత్సం  

అచ్చంపేట, ఫిబ్రవరి 17: ఓ ఇంట్లో అద్దె ఇల్లు కావాలంటూ ఇద్దరు మహిళలు ముస్లింలు ధరించే బుర్కాతో వెళ్లి ఓనర్ పీక  పిసికి 12 తులాలు లాక్కెళ్ళిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న రామకృష్ణ ధరణి దంపతుల ఇంటికి ఆదివారం రాత్రి ఇద్దరు మహిళలు ముస్లిం మహిళలు ధరించే బుర్కా వేసుకొని కింది ఫ్లోర్లో అద్దె ఇల్లు కావాలంటూ పై అంతస్తులోని ఓనర్ ఇంట్లోకి వెళ్లారు.

అద్దెకు ఇల్లు కాలి లేదని చెప్పడంతో దాహం వేస్తోంది  నీళ్లు కావాలంటూ మాట కలిపి ఒంటరిగా ఉన్న ఓనర్ ధరణి గొంతు నులిమి హత్యకు యత్నించారు.

బంగారం తీసుకెళ్ళినా సరే తనను వదిలేయాలంటూ ప్రాధాయపడడంతో 12 తులాల బంగారాన్ని తీసుకొని పరారయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలను సేకరించి భర్త రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.