calender_icon.png 22 January, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చనిపోతున్నా.. ఫ్లెక్సీలు కొట్టించండి

22-01-2025 02:44:08 AM

స్నేహితులకు మెసేజ్ చేసి బాలుడి ఆత్మహత్య

జనగామ, జనవరి 21 (విజయక్రాంతి): ‘నేను కొద్దిసేపట్లో చనిపోతున్నా.. నా ఫొటోలతో మంచి ఫ్లెక్సీలు కొట్టించండి.. బాయ్ రా’ అంటూ వాట్సప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టి ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో చోటుచేసుకుంది. నెల్లుట్ల గ్రామానికి చెందిన దీకొండ సత్తయ్య, రేణుక దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

వీరికి ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు లక్ష్మణ్(13) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మి  తరగతి చదువుతున్నాడు. సోమవారం లక్ష్మణ్ బడికి డుమ్మా కొట్టాడు. మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత పాఠశాల స్నేహితులకు సంబంధించిన వాట్సప్ గ్రూపులో పలు మెసేజ్‌లు పెట్టాడు. తనకు బతకాలని లేదని, తాను చనిపోగానే తన ఫొటోలతో ఫ్లెక్సీలు పె  కోరాడు.

ఈ మెసేజ్‌లను సాయం  పాఠశాల ముగిశాక స్నేహితులు చూశారు. సాయంత్రం 4 గంటల సమయంలో బాలుడి ఇంటికి వెళ్లి చూడగా లక్ష్మణ్ ఇంట్లో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఆ సమయంలో పొలం దగ్గర ఉన్న తల్లిదండ్రులు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని బోరున విలపించారు. విద్యార్థి ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు.