calender_icon.png 30 March, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఎంటీఎస్ ఎక్కాలంటే భయం!

27-03-2025 12:40:27 AM

  1. ఎవరికీ పట్టని లోకల్ ట్రైన్ వ్యవస్థ
  2. వేళాపాళా లేకుండా నడపడంతో తగ్గిన ప్రయాణికులు
  3. అసాంఘిక శక్తులకు అడ్డాగా రైళ్లు

హైదరాబాద్, మార్చి 2౬ (విజయక్రాంతి): ఎంఎంటీఎస్(మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం) రైళ్లు ప్రారంభించిన కొత్తలో నిలబడేందుకు కూడా  చోటులేకుండా ప్రయాణికులతో కిటకిటలా డేవి. కేవలం రూ.5 ప్రారంభ చార్జితో ప్రయాణించేందుకు అవకాశం ఉన్న ఈ రైళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచాయి.

అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ సేవల కోసం తన వంతు వాటా సొమ్ము ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో రైల్వేశాఖ అప్పటి వరకు తన వద్ద ఉన్న అరకొర రైళ్లను మాత్రమే తిప్పడం ప్రారంభించింది. ఒకప్పుడు కేవలం 5, 10 నిమిషాల కంటే ఆలస్యం కాని రైళ్లు కాస్త గంటల తరబడి లేటుగా నడవడం మొదలైంది. 

అసాంఘిక వ్యక్తులకు అడ్డాగా..

ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఎంఎంటీఎస్ రైళ్లు చివరకు గంజాయి బ్యాచ్, వైట్‌నర్ వ్యసనపరులు, తాగుబోతులు, హిజ్రాలు, దొంగలు వంటి వారికి అడ్డాగా మా రాయి. చెయిన్ స్నాచర్లు, పిక్‌పాకెటర్స్ రద్దీ లేని రైళ్లలో ఉంటూ ఒంటరిగా ఉన్న వారిపై బెదిరించి మరీ దొంగతనాలకు పాల్పడిన ఘ టనలు కూడా పలుమార్లు చోటుచేసుకున్నాయని పలువురు చెబుతున్నారు.

గ్రూపు లుగా వచ్చే ఆకతాయిలు మహిళలే కాదు పరుషులపై కూడా దౌర్జన్యంగా వ్యవహరించే ప్రమా దం ఉందని అంటున్నారు. ఇటీవల యువతిపై అత్యాచార యత్నం, తప్పించుకునే ప్రయత్నం లో రైలు నుంచి యువతి దూకేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ రైళ్లలో ఒంటరిగా మహిళలు ప్రయాణిస్తే వారికి నరకం కనిపిస్తుందని శ్రావణి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తెలిపారు. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం, రాత్రిపూట కావడంతో భయమేస్తోందని.. ఫలితంగా మెట్రో రైలు, ఆటోలో ఇంటికి వెళ్లిపోతున్నట్లు చెప్పారు. 

నిమ్మకునీరెత్తినట్టుగా ప్రభుత్వాలు..

ఎంఎంటీఎస్‌ల దుస్థితికి ప్రభుత్వాలదే పూర్తి బాధ్యత అని రైల్వే రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. నగరంలో ఓవైపు భారీగా కాలుష్యం పెరిగిపోతుంటే ప్రత్యామ్నాయ ప్రజారవాణాపై దృష్టిపెట్టాల్సిన ప్ర భుత్వాలు నిమ్మకునీరెత్తినట్లుగా ఉండటం వల్లే లోకల్ రైల్వే రవాణా వ్యవస్థ గాడి తప్పిందని చెబుతున్నారు. గత పదేళ్లలో ఏ రోజు కూడా రాష్ట్ర ప్ర భుత్వం ఈ అంశంపై సమీక్షించిన దాఖలాలు లేవు. ప్రజారవాణా మెరుగుపడాలంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని రైల్వే అధికారుల తో సమీక్షిస్తే బాగుంటుందని రిటైర్డ్ రైల్వే అధికారి వెంకటేశం ‘విజయక్రాంతి’కి తెలిపారు.

121 నుంచి 40కు పడిపోయాయి..

కరోనాకు ముందు 121 ఎంఎంటీఎస్ రైళ్లు నడిచేవి. సుమారు 1.60 లక్షల మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణించేవారు. కానీ కరోనా తర్వాత చాలా ఆలస్యంగా ప్రారంభమైన ఎంఎంటీఎస్ సర్వీసులు వేళాపాళా లే కుండా కేవలం 40 రైళ్లను మాత్రమే తిప్పారు. దీంతో ప్రయాణికులు ఎక్కడం మానేశారు. ఫలితంగా ప్రయాణికుల సంఖ్య 50వేల లోపు పడిపోయింది.

ఎంఎంటీఎస్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన హైలెట్స్ యాప్‌ను తీసేశారు. దీంతో కనీస సమాచారం కూడా ప్రయాణికులు అందదు. ఫలితంగా రైలులో చివరి స్టేషన్లకు వచ్చే వరకు ఇద్దరు, ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించే దుస్థితి. దీంతో అసాంఘిక శక్తుల భయంతో సాయం త్రం 7 దాటిందంటే ప్రయాణం ప్రమాదకరంగా మారిందని అంటున్నారు. 

భద్రతను కొనసాగించాలి..

రైల్వే శాఖ చెప్తున్న ప్రకారం నిత్యం 40కి పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇటీవల కా లం వరకు రైల్వే టైం టేబుల్ గందరగోళంగా ఉండేది. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి చాలా రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు తరలించారు. ఇప్పుడు కాస్త వెసులుబాటు వచ్చింది. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైల్వే టైంటేబుల్‌ను సెట్ చేసి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తే మేలు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రైల్వే పోలీసులు ఇప్పు డు ఎంఎంటీఎస్ రైళ్లలో పోలీసు భద్రతను ఏ ర్పాటు చేశారు. రైల్వే పోలీసులు సైతం రైళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇవి మూన్నాళ్ల ముచ్చటగా కాకుండా రెగ్యులర్‌గా కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నా రు.