26-03-2025 12:00:00 AM
ఒకప్పుడు సాఫ్ట్‌వేర్(ఐటీ) ఉద్యో గం అంటే క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆ ఉద్యోగం చేసే వారిని చూస్తే జాలివేసే పరిస్థితి. వారి శక్తిని, యవ్వనాన్ని కంపెనీ లు కరిగిస్తున్నాయి. ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు ఆహారం తీసుకుంటారో, ఎప్పుడు పని చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఐటీ ఉద్యోగస్తులు 50 సంవత్సరాలకే వృద్ధులవుతున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచీ కరణ, ప్రభుత్వ అనుకూలమైన విధానాల కారణంగా భారతదేశంలో సమాచార సాంకేతిక (ఐటీ) పరిశ్రమ అద్భుతమైన ఊపును పొందింది. ఐటీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు తమ పనిలో నిరంతర శారీరక , మానసిక ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
యాసిడ్ పెప్టిక్ వ్యాధి, మద్యపానం, ఉబ్బసం, మధుమేహం, అలసట, టెన్షన్ తలనొప్పి, రక్తపోటు, నిద్రలేమి, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, సైకోన్యూరోసిస్, లైంగిక అసమర్థత, సొరియాసిస్, లైకెన్ ప్లానస్, ఉర్టికేరియా, ప్రురిటస్, న్యూరోడెర్మాటిటిస్ వంటి చర్మ వ్యాధులు ఒత్తిడి కారణంగావచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలు. ప్రపం చీకరణ, ప్రైవేటీకరణ కొత్త పని సంబంధాలను తెచ్చిపెట్టాయి.
వేగంగా ఎదుగుతున్న పరిశ్రమ
ఐటీ పరిశ్రమ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఒకటిగా మారింది. గత కొన్ని సంవత్సరాలు గా బలమైన డిమాండ్ భారతదేశాన్ని ఆసి యా- పసిఫిక్ ప్రాంతంలో వేగంగా అభివృ ద్ధి చెందుతున్న ఐటీ మార్కెట్లలో ఒకటిగా నిలిపింది. ఏ రకమైన ఉద్యోగానికైనా లక్ష్యాలు ఉంటాయి. ఒక ఉద్యోగి సాధించలేని లక్ష్యాలతో కేటాయించబడినప్పుడు, ఇచ్చిన పరిస్థితిని నిర్వహించలేనప్పుడు ఒత్తిడికి గురవుతాడు.
ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెత వందల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అనేక జాగ్రత్తలు తీసుకున్న విషయాన్నిగమనించాలి. కానీ ఇటీవ ల కాలంలో పట్టణాలతో సంబంధాలు భారీగా పెరిగిన తర్వాత వాతావరణం ఏ రకంగా కలుషితమైందో ఆహారం, నిద్ర ఇతర జీవన విధానాలు అన్నీ కూడా చెడి పోయి దాని ప్రభావం స్పష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో కనపడుతున్నది.
గత మూడు నాలుగు దశాబ్దాలుగా గమనించినప్పుడు విజ్ఞాన శాస్త్రం విస్తృతస్థాయిలో అభివృద్ధి చెంది దాని పర్యవసానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం భారీగా తన పాత్రను పోషిస్తున్న నేపథ్యంలో పేద, ధనిక తేడా లేకుండా అర్హత గల చదువుల తర్వాత వారి చురుకుదనం, నైపుణ్యం, సృజనాత్మకత కారణంగా ఐటీ ఉద్యోగులుగా ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో నియామకం కావడం అనేది గత రెండు మూడు దశాబ్దాలుగా మనం గమనించవచ్చు.
కంపెనీ లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ విధానాలను కొనసాగించడంతోపాటు, బహుళ జాతి సంస్థల ప్రాబల్యం గణనీయంగా పెరిగిపోవడం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇత ర దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం వలన కూడా ఇతర దేశాల కంపెనీలు భారీగా తరలి రావడంతో ఉద్యోగాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
వృత్తి స్వభావరీత్యా 1012 గంటల పాటు తప్పనిసరిగా ఏక దీక్షతో పనిమీద మనసుపెట్టి ఇచ్చిన ప్రాజెక్టును సఫలం చేయడంలో కష్టపడవలసి రావడంతో ఐటీ ఉద్యోగుల కు విశ్రాంతి అనేది లేకుండా పోతున్నట్లు కొందరి అనుభవాల ద్వారా తెలుస్తున్నది.
అదే సందర్భంలో వేతనాలు భారీగా ఇస్తు న్న కొన్ని కంపెనీలు అదే స్థాయిలో పని తీసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భం, వేతనాలు తక్కువ ఉన్నప్పటికీ పని తీసుకోవడంలో మాత్రం వెనుకంజ వేయకపోవడం వలన అనివార్యంగా ఐటీ ఉద్యోగులపైన ఒత్తిడి పడుతోంది.
దీనికి ప్రాంతాలు, దేశాలతో సంబంధం లేకుం డా ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఎదుర య్యే అవకాశం ఉన్నట్లు ఇటీవల హైదరాబాద్‌లోని సెంట్రల్ విశ్వవిద్యాలయ వైద్య విభాగం ఐటీ ఉద్యోగుల మీద జరిపిన పరిశోధన ద్వారా రూఢీ అవుతున్నది.
సర్వే ఫలితాలు
ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల పైన పూర్తిస్థాయిలో స్పష్ట తనివ్వడం కోసం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని వైద్య విభాగం ప్రొఫెసర్ కళ్యాణ్కర్ మహదేవ్ నేతృత్వం లో ప్రొఫెసర్ అనిత, మరి కొంతమంది పరిశోధక విద్యార్థుల ఆధ్వర్యంలో 2023 జూన్ నుండి 2024 జూన్ వరకు సుమా రు 3450 మంది ఐటీ ఉద్యోగుల పైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారు కొన్ని నిర్ణయాలకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
తమ సందేహాలను తీర్చుకోవడంతోపాటు ఆయా ఐటీ ఉద్యోగులకు కొన్ని సూచనలు ఇవ్వడం కోసం ప్రత్యేకం గా ఈ బృందం ఏఐజి ఆసుపత్రిలోని హెపటాలజిస్ట్ డాక్టర్ పిఎస్ రావును కలిసి తమ పరిశోధన విషయమై తెలిపి సహకరించవలసిందిగా కోరినప్పుడు వైద్య పరీ క్షలు నిర్వహించడానికి ఆయన అంగీకరించారు.
ఆ మేరకు సామాజిక మాధ్యమాలు, షాపింగ్ మాల్స్ అనేక చోట్ల కూడా ప్రచా రం నిర్వహించగా వైద్య పరీక్షలు చేసుకోవడానికి ఐటీ ఉద్యోగులు ముందుకు రావ డం అభినందనీయమే. దాని కారణంగా ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా కొన్ని సమాధానాలు రాబట్టడంతో పాటు ఊబకాయం, ఇతర జబ్బులతో వారు ఇబ్బందులు పడుతున్నారని పరిశోధన ద్వారా తెలిసికొని తమకు వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం వెను వెంటనే వైద్య పరీక్ష లు నిర్వహించడంతో కొన్ని విషయాలు నిర్ధారణ అయ్యాయి.
ఐటీ ఉద్యోగులలో 84 శాతం మందికి ఊబకాయం, ఫ్యాటీ లివర్‌తో ఇబ్బందులు పడుతున్నట్లు, ఇం దులో 5 శాతం మందికి కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయినట్లు గమనించారు.- 71 శాతం మంది యువతలో ఊబకా యం ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేలిం ది. 34 శాతం మందిలో జీర్ణక్రియ సరిగా లేకపోవడంతోపాటు అదనంగా 10 శాతం మందిలో మధుమేహం ఛాయలు కనపడినట్లుగా నిర్ధారణకు రావడం జరిగింది.
పరిశోధన బృందం సూచనలు
హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు యాజమాన్యాలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ అందులో కాలేయ పరీక్షలు లేక పోవడంతో ఆ ముప్పును గ్రహించలేకపోతున్నారని పరిశోధనా బృందం సారథి తెలియజేశారు.
ఫ్యాటీ లివర్ సమస్య ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉన్నట్లు తేలిందని, ఊబకాయం, కాలేయ జబ్బు సమస్యలను పరిష్కరించుకోవడం కోసం శారీరక వ్యాయామం తప్పనిసరి చేయాలని, తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాల నిధ్యానం, ప్రాణాయామం ద్వారా జీవనశైలిలో మార్పు తీసుకురావడం అవస రమని సూచించినట్టు తెలుస్తున్నది.
ఐటి ఉద్యోగం అనగానే యాంత్రికమైనటువంటిదని, గంటల తరబడి చేసే ఉద్యోగమని, దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయనే మానసిక ఆలోచన కూడా ఆ రకమైనటువంటి అనారోగ్యాలు రావడానికి కారణమని కొందరు అంచనా వేస్తున్నారు. మానవ సంబంధాలు బలహీనంగా ఉండడం, కేవలం వృత్తికి పరిమి తమై మౌనంగా పనిచేయడం, విశ్రాంతికి తావులేని పద్ధతిలో ఈ ఉద్యోగం కొనసాగడం కూడా ఈ అసంబద్ధ విధానాలకు కారణమవుతున్నట్లు అంచ నా.
ఉద్యోగుల ఆరోగ్యాన్ని, ఆయా కుటుంబాల మనుగడను, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని యాజమాన్యాలు వైద్యుల సల హా మేరకు కొన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కల్పించడం అవసరమని భావన. ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అవకాశాలను వినియోగించుకోవడంతో పాటు యాజమాన్యాల వద్ద కొన్ని డిమాండ్లనుపెట్టి సాధించుకోవడం కూడా అవసరమే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది మాన సిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ ప్రకా రం చాలామంది యజమానులు భావోద్వేగ, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను మెరుగుపరుస్తున్నారు.