- దీన్‌దయాళ్ దవాఖానకు తరలింపు
- వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తీహార్‌కు
న్యూఢిల్లీ, జూలై 16: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నాలుగు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న ఆమె ఆరోగ్యం క్షీణించటంతో జైలు అధికారులు మంగళవారం దీన్‌దయాళ్ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను జైలుకు తరలించినట్టు సమాచారం. కవిత అస్వస్థతకు గురయ్యారని తెలియటంతో ఆమె కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పలుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ట్రయల్‌కోర్టుతోపాటు ఢిల్లీ హైకోర్టు కూడా వాటిని తిరస్కరించింది. దీంతో ఆమె జైల్లోనే ఉండాల్సి వచ్చింది.