పరామర్శించిన కలెక్టర్
మంచిర్యాల, నవంబర్ 6 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సాయి కుంటలో గల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బుధవారం 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు ఉదయం కిచిడీ, చారుతో భోజనం చేశారు.
అస్వస్థతకు గురైన వారిలో నాగదేవత, రుషిత, జ్యోతిలక్ష్మి, శ్రీలేఖ, లక్ష్మి, శ్రీలత, మౌనిక, భూమిక, సారిక, వైష్ణవి, రాధిక, సింధు ఉన్నారు. విద్యార్థులను పరీక్షించిన వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని తెలిపారు. విద్యార్థుల అస్వస్థతపై వార్డెన్ లక్ష్మిరాజంను వివరణ కోరగా విద్యార్థులతో కలసి తము కూడ భోజనం చేసినట్లు తెలిపారు.
మొత్తం విద్యార్థుల్లో 12 మందికి మాత్రమే ఇలా అయ్యిందన్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్, డీటీడీవో, ఏటీడీవో, డీఎంహెచ్‌వో హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.