calender_icon.png 28 October, 2024 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత

28-10-2024 01:45:04 AM

  1. పెద్దపల్లి జిల్లా దవాఖానకు తరలింపు
  2. నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం.. 
  3. వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలు

మంథని (ముత్తారం), అక్టోబర్27 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మం డల పరిధిలోని కాస్బూర్బా విద్యాలయంలో 6, 7వ తరగతులకు చెందిన విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు.

అప్రమత్తమైన యాజమా న్యం విద్యార్థినులను వెంటనే అంబులెన్స్‌లో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించింది. విద్యాలయ ఎస్వోతో పాటు మండల వైద్యాధికారి అమరేందర్‌రావు, డీసీడీవో కవిత దవాఖనకు చేరుకొని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చొరవ తీసుకున్నారు.

మరోవైపు విద్యార్థినుల అస్వస్థతకు గురికావడంపై  వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున దవాఖానకు చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని డీసీడీవో కవిత సూచించారు. కాగా, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై మంత్రి శ్రీధర్‌బాబు ఆరా తీశారు.

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ శ్రీహర్షకు కాల్ చేసి ఆదేశించారు. మంత్రి అవసరమైతే విద్యార్థులను హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని మంత్రి సూచించారు.