calender_icon.png 21 January, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత

16-07-2024 06:45:09 PM

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తిహర్ జైల్ నుంచి దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా కవిత ఆరోగ్యంగా ఉన్నట్లు తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. కవితను పరిశీలించిన వైద్యులు ఆమెకు జ్వరం ఉందని చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలతో అరెస్టైన కవిత దాదాపు 4 నెలలుగా జైలులో ఉన్నారు.