calender_icon.png 18 April, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీకల్లు తాగి 30 మందికి అస్వస్థత

09-04-2025 04:37:28 PM

ఆరుగురు సీరియస్..

వింతగా ప్రవర్తిస్తున్న బాధితులు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం రేపింది. గాంధారి మండలం గౌరారం గ్రామంలో కుస్తీ పోటీల సందర్భంగా మంగళవారం గ్రామస్తులు కొందరు కల్లు సేవించారు. వారిలో 30 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కల్లు దుకాణంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కల్లు తాగిన బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు. వీరిని నిజామాబాద్ లోని డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. కల్లు తాగి అనారోగ్యానికి గురై బాన్సువాడ ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న గౌరారం గ్రామానికి చెందిన ఐదుగురిని ఎల్లారెడ్డి ఆర్డీవో బుధవారం పరామర్శించారు.