calender_icon.png 17 October, 2024 | 4:58 AM

బీడీ కంపెనీ అక్రమ వసూళ్లు

17-10-2024 02:29:08 AM

ఒక్క కార్మికురాలి నుంచి రూ.1,000 కి రూ.10..

ఏడాదికి రూ.20 కోట్లు వసూలు చేసిన దేశాయి బీడీ కంపెనీ!

కంపెనీని ముట్టడించిన బీడీ కార్మికులు

కామారెడ్డి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డిలోని దేశాయి బీడీ కంపెనీని బీడీ కార్మికులు బుధవారం ముట్టడించారు. ఒక్క కార్మికురాలి నుంచి రూ.1,000 కి రూ.10 చొప్పున అక్రమంగా వసూలు చేసి, ఏడాదికి దాదాపు రూ.20 కోట్లు బీడీ యాజమాన్యం వసూలు చేస్తున్నదని కార్మికులు ఆరోపించారు.

ఆ డబ్బులను తిరిగివ్వాలని కోరుతూ రెండుగంటల పాటు భారీ ధర్నా నిర్వహించారు. డబ్బులను వెంటనే కార్మికులకు తిరిగి ఇవ్వకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని బీడీ అం డ్ సిగార్ వర్కర్స్ యూనియాన్, సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ రమ, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హెచ్చరించారు. దేశాయి బీడీ కం పెనీ పరిధిలో 52 సెంటర్లలో రూ.100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంపిల్ బీడీల పేరుతో రోజుకు 400 బీడలు వసూలు చేస్తున్నారని, అది ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కార్మిక సంఘం ప్రతినిధులు వెంకట్ గౌడ్, కొత్త నర్సింలు, అరుణ్, శ్రీహరి, రాణి, భాగ్యమ్మ, రేణుక, లక్ష్మి, ప్రేమలత, జ్యోతి, సత్యం, రాజనర్సు పాల్గొన్నారు.

పాల్వంచలో

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు జీవనభృతి రూ.4,016 ఇవ్వాలని కోరుతూ బుధవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో బీడీ కార్మికులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.  అనంతరం తహసీల్దార్ జయంతిరెడ్డి, ఆర్‌ఐ విద్యాసాగర్‌లకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యాక్రమంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బీఎల్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు అనుసూయ, వెంకటలక్ష్మీ, బీడీ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.