22-03-2025 01:56:24 AM
ఇల్లెందు, మార్చి 21 (విజయక్రాంతి):బొగ్గు ఉత్పత్తి లో 2024-25 ఆర్ధిక సంవత్సరమునకు సింగరేణి ఇల్లందు ఏరియా కు కేటాయించిన 41.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 11 రోజుల ముందుగానే అధిగమించామని ఏరియా జనరల్ మేనేజర్ వి కృష్ణయ్య ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21 నాటికీ, ఇల్లందు ఏరియా కు 2024-25 వార్షిక సంవత్సరానికి కేటాయించిన దాని కంటె ఎక్కువగా 41.35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 100.12 శాతం తో అన్ని ఏరియాల కంటే 11 రోజుల ముందుగానే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి ఇల్లందు ఏరియా ప్రథమ స్థానంలో నిలువడం జరిగిందని తెలిపారు.
ఈ లక్ష్య సాధనకు ఉద్యోగులు నిబద్దతతో కూడిన పని సంస్కృతిని అలవర్చుకొని అంకిత భావంతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతకు పాటు పడటంతోనే సాధ్యమైందని, రక్షణతో పనిచేసి ఉత్పత్తి లక్ష్యాలు సాధించడంలో ఇల్లందు ఏరియా సింగరేణి ఉద్యోగులకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, అందుకు గాను ప్రతి సంవత్సరం.
సాధిస్తు సరికొత్త రికార్డుల పరంపరను సాగిస్తుందని, భవిష్యత్తులోను ఇల్లందు ఏరియా మరెన్నో రికార్డులు సాధించేందుకు కృషి చేయాలని, సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యo సాధించినందుకు గాను అధికారులకు, సూపర్వైజర్లుకు, అధికారుల సంఘానికి, యూనియన్ నాయకులకు, ఉద్యోగులకు అభినందనలు తెలుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.