calender_icon.png 1 January, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత

29-12-2024 03:02:35 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్(Adilabad) జిల్లా ఇచ్చోడ మండలంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీశాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు(Forestry Task Force officials) పట్టుకున్నారు. హరినాయక్ తాండా మార్గంలో సైకిల్ మోటర్ పై తరలిస్తున్న 12 టేకు కలప(Teak Wood)ను కాపుకాసి పట్టుకున్నట్లుగా జిల్లా టాస్క్ ఫోర్స్ రేంజ్ అధికారి గంటల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దుండగులు పారిపోగా కలపను, 2 బైక్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దుండగుల వివరాల కొరకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కలపను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.