calender_icon.png 13 March, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా రవాణా చేస్తున్న 79.50 క్వింటాళ్ళ పిడిఎస్ పట్టివేత

13-03-2025 10:47:06 AM

గోదావరిఖని,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమీషనర్(Ramagundam Police Commissioner) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అక్రమంగా తరలిస్తున్న 79.50 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 ఇంక్లైన్ వద్ద, మంథని నుండి గోదావరిఖని మీదుగా మహారాష్ట్రకి TS-02-UA 1517 డీసీఎం వ్యాన్ లో అక్రమంగా  బియ్యాన్ని తరలిస్తున్న మంథని శ్రీపాద కాలనీకి చెందిన దేశెట్టి మారుతి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. 3,08,100/-రూపాయలు ఉంటుందన్నారు. అలాగే మంథనికి చెందిన రాచర్ల రమేష్, ఓదెల మహేందర్, సిరోంచకు చెందిన యెల్లంకి వీరన్ లు పరారీలో ఉన్నారని, దీంతో పాటు స్వాదీన పరుచుకున్న 79.50 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, డీసీఎం వ్యాన్, నిందితున్ని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని 1-టౌన్ పోలీస్ లకు అప్పగించమన్నారు.