calender_icon.png 29 March, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

26-03-2025 07:47:07 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామం వద్ద ఒక ఆటోలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం కడం నుంచి తర్లపాడు వైపు వస్తున్న ఆటోను తనిఖీ చేయగా దానిలో అక్రమంగా తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకుని సీజ్ చేసినట్లు ఆటో యజమాని షేక్ రహమత్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.