calender_icon.png 28 April, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత...

27-04-2025 04:29:13 PM

ఇచ్చోడ (విజయక్రాంతి): మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం తీసుకువస్తున్న బజహారత్నూర్ మండలానికి చెందిన తోట త్రిశూల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకువస్తుండగా సోనాల మండలం ఘనపూర్ చెక్ పోస్ట్(Ghanpur Check Post) వద్ద 16 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని, తోట త్రిశూల్ పై కేసు నమోదు చేసినట్లు ఇచ్చోడ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జూల్ఫీకర్ హైమద్(Excise Circle Inspector Zulfiqar Haimad) తెలిపారు. ఎవరైనా కానీ మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం తీసుకోచ్చినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.