15-02-2025 10:58:23 PM
భీమదేవరపల్లి మండల వాసి అరెస్టు
భీమదేవరపల్లి,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్‌కుమార్ పట్టుకున్నారు. సూరారం గ్రామంలో చర్చికి సమీపంలో భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామానికి చెందిన నర్రావుల ఆంజనేయులు 31 క్వింటాళల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. బియ్యం విలువ సుమారు 50 వేల వరకు ఉంటుందన్నారు. ఆంజనేయులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.