సిద్దిపేట, జనవరి 30 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బావిస్ ఖానా పూల్ వైపు నిర్మించిన మూఢవ అంతస్తుల భవనాన్ని సిద్దిపేట మున్సిపల్ అధికారులు గురువారం సీజ్ చేశారు.
టౌన్ ప్లానింగ్ అధికారులు నస్రీన్ బానో, దేవరాజ్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ కమిటీ బిల్డింగ్ ని సీజ్ చేశారు. బిల్డింగ్ నిర్మానానికి అనుమతి ఉన్న సెల్లార్ నిర్మాణానికి అనుమతి లేదని సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.