25-04-2025 05:55:29 PM
పసిగట్టి పట్టుకున్న మైనింగ్ అధికారులు...
1 జేసీబీ 5 టిప్పర్లు సీజ్...
కూచిపూడి గ్రామ శివారులో ఘటన..
కోదాడ: పర్మిషన్ లెటర్ పై ఫోర్జరీ డేట్ తప్పుగా పెట్టి అధికారులను మస్క కొట్టి, దర్జాగా మట్టి విక్రయాలు చేస్తున్న మట్టి దందాకు మైనింగ్ అధికారులు(Mining authorities) శుక్రవారం భారీ షాక్ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ 615 వెంకయ్య భూమిలో మట్టి పర్మిషన్ కు మైనింగ్ అధికారులు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 4 వరకు పర్మిషన్ ఇచ్చారు. కాగా దాన్ని జనవరి 16 నుంచి జూన్ 4 వరకు పర్మిషన్ లెటర్ లో ఫోర్జరీ డేట్ తప్పుగా పెట్టి మట్టి వ్యాపారస్తులు దర్జాగా మట్టి దందా చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మైనింగ్ అధికారి ఏడి విజయరామరాజు తన సిబ్బందితో హుటాహుటిన తనిఖీలు చేపట్టారు. దీంతో అసలు బాగోతం బయటపడింది. ఒక జెసిబి, ఐదు టిప్పర్లను సీజ్ వారి వెంట అసిస్టెంట్ డైరెక్టర్ వెంకన్న, ఆర్ఐ, పోలీసులు ఉన్నారు.