calender_icon.png 23 March, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాత్రివేళలో మట్టి, ఇసుక అక్రమ రవాణా

22-03-2025 12:35:34 AM

చోద్యం చూస్తున్న అధికారులు..

ముత్తారం మార్చి 21(విజయ క్రాంతి) ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి మాఫియా గాళ్లకు అడ్డగా మారింది. గ్రామం లో రాత్రి, పగలు అని తేడా లేకుండా కొంత మంది  మట్టి, ఇసుక ను మాఫియా గాళ్లు అక్రమ రవాణా చేస్తూ... లక్షల్లో సంపాది స్తున్నారు.

రాత్రి తెల్లవారు దాకా జెసిపి తీసుకొచ్చి ఎంచక్కా లారీలలో ట్రాక్టర్లలో మట్టిని, ఇసుకను ఇతర ప్రాంతాలకు తర లించి సొమ్ము చేసుకుంటున్నారు.  ఇంత తతాంగం జరుగుతున్న రెవెన్యూ, మైనింగ్ పోలీస్ అధికారులు మాత్రం చోద్యం చూస్తు న్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఖమ్మంపల్లి లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

గత వారం రోజులుగా రాత్రి వేళలో ఖమ్మంపల్లి గ్రామంలో ఇసుక రవాణా చేస్తూ రాత్రి వేళలో ట్రాక్టర్లు పట్టుకున్నట్టు ముత్తారం ఎస్త్స్ర నరేష్ తెలిపారు. గ్రామంలో ఉదయం పోలీసులు వాహనాలు తనిఖీ చేయుచుండగా గ్రామానికి చెందిన లక్ష్మీ రాజ్యం అనే వ్యక్తి అక్రమంగా ఇసుక తరలి స్తుండగా పట్టుకున్నామని ఎస్‌ఐ తెలిపారు.