25 కేజీల బియ్యంతో పాటు ఆటో ట్రాలీ సీజ్
మంథని (విజయక్రాంతి): మంథని నుండి అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని రవాణా చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మంథని ఎస్ఐ రమేష్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు తమ సిబ్బంది, సివిల్ సప్లయర్ అధికారులకు సమాచారం ఇచ్చి వారితో కలిసి సిరిపురం గోదారి బ్రిడ్జి వద్ద ఒక TS 08 EB 5174 గల వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో ప్రజా పంపిణీ బియ్యం 25 కేజీలు ప్లాస్టిక్ సంచులలో ఉన్నాయని, ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లికు చెందిన మోనుగుప్తను అదుపులోకి తీసుకొని, వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి, అతనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.