04-04-2025 12:12:49 AM
తీర్మాన్ పల్లిలో జోరుగా సాగుతున్నఅక్రమ కలప వ్యాపారం
కలప దగ్ధంతో వెలుగుచూసిన అక్రమ కలప నిలవలు
నిజామాబాద్: ఏప్రిల్ 3: (విజయక్రాంతి): నిజామాబాద్ మండల పరిధిలోని తీర్మాన్ పల్లి గ్రామంలో అడ్డు అదుపు లేకుండా అక్రమ కల్ప వ్యాపారం జరుగుతుంది. అంటే అవుననే సమాధానం వస్తుంది.గ్రామంలో అక్రమంగా కల్ప నిల్వలకు అదే గ్రామంలోని కొందరు కమిటీ కి చెందిన ఒకరిద్దరు వ్యక్తులు బహిరంగనే మద్దతు ఇవ్వడంతో ఈ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది. గత కొద్దిరోజుల క్రితం అక్రమంగా విలువ ఉంచిన కలప దగ్ధం కావడంతో ఈ విషయం బయటమైంది. ఈ అక్రమ కల్ప వ్యవహారం వెనకాల సంబంధిత శాఖల ఉద్యోగుల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఆర్ అండ్ బి ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు అందినప్పటికిని ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అక్రమంగా నిల్వ ఉంచిన కలప విషయమై గతంలో ఫారెస్ట్ అధికారులు తీర్మాన్ పల్లి గ్రామాన్ని సందర్శించి అటవీశాఖ అధికారులు కలప విషయమై విచారణ జరిపి నప్పటికిని ఎటువంటి చర్యలు అక్రమ కలప దారులపై తీసుకోలేదు. కనీసం గ్రామంలో నిలువ ఉన్న కలపను స్వాధీనం చేసుకోలేదు.
తమ అక్రమ కల్ప వ్యాపారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటీవల గ్రామంలో గ్రామ అభివద్ధి కమిటీని మచ్చిక చేసుకొని ఒకరిద్దరితో లోపాయి కారి ఒప్పందం పెట్టుకుని గ్రామంలోని హరితహారంలో నాటిన చెట్లు సంవత్సరాల తరబడి గ్రామంలో ఉన్న చెట్లను గ్రామ ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే పచ్చని చెట్లను కూడా విచక్షణ రైతంగా నరికేశారని తెలిపారు. గ్రామంలో వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది సంబంధిత శాఖల వారు వీరికి పరోక్షంగా సహకరించడంతో వీరి ఆక్రమ కలప వ్యాపారం కొనసాగుతోంది. గత నాలుగు రోజుల క్రితం అక్రమంగా నిల్వఉంచిన కలప కుప్ప దగ్ధం కావడంతో ఈ కల్ప దంద బాగోతంవెలుగు చూసింది.
ఈ విషయాన్ని కప్పిపుచ్చడానీ కై కలప ను దగ్ధం చేసినట్టు గ్రామానికి సంబంధించిన యువకులపై అక్రమ కలప నిలువలపై ఫిర్యాదు చేసిన వారిని పై కేసులు నమోదు చేయించడానికి అందరూ ప్రయత్నిస్తున్నట్టు గ్రామ యువకులు తెలిపారు. ఇటీవల కల్ప అక్రమ ఇవాళ బాగోతం బట్టబయలు కావడంతో సదరు వ్యాపారస్తులు గ్రామపంచాయతీ అధికారుల వద్దకు వెళ్లి తమకు అనుమతి పత్రం ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నారు. అనుమతులు ఇచ్చే అధికారం తమకు లేదని గ్రామపంచాయతీ అధికారులు తేల్చి చెప్పడంతో దిక్కుతో స్థితిలో అక్రమ కల్ప వ్యాపారులు ఉన్నారు.
ఇటీవల గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికను మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఆ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన విషయంలో తల్లిదండ్రులకు అండగా ఉండి ఫోక్సో కేసు నమోదు చేయించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి. కలప దగ్ధం కేసు నమోదు చేయించి వారిని ఇబ్బందుల గురిచేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా గ్రామ యువకుల ఆరోపిస్తున్నారు. ఎది ఏమైనాప్పటికిని గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని ఇరువర్గాలను రెచ్చగొట్టి గ్రామంలో కలహాలు సష్టించే ప్రయత్నం జరుగుతోందని గ్రామస్తులు యువత వాపోతున్నారు. గతంలో ఫోక్సో కేసులో బాలిక తరపున కీలకంగా వ్యవహరించిన ఒకరిద్దరిపై వీడిసి సభ్యులు ముందుగా కలప దగ్ధం కేసు నమోదు చేయాలని ప్రయత్నం చేసి తర్వాత మతకలహాలు రెచ్చగొడుతున్నారనే సాకుతో కేసులు నమోదు చేయించి.
తర్వాత వారిని గ్రామ బహిష్కరణ చేయాలని కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని వారి అక్రమ మాలకు అడ్డు లేకుండా పోతుందని గ్రామస్తులు యువకులు ఆరోపిస్తున్నారు. తీర్మాన్ పల్లి గ్రామంలో ప్రశాంత వాతావరణన్ని దెబ్బతీసేందుకు రాజకీయ నాయకులు కుట్ర పలుతున్నట్టు తెలుస్తోంది. అసలు ఈ కలప ఎక్కడిది ఎవరి తాలూకు కలప దగ్ధమైన వారు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు. కలప ఫలానా వారిదని అటవీశాఖ వారి అనుమతి గానీ రోడ్లు భవనాల శాఖ అనుమతి గాని ఏమీ లేదు. మరి ఆ దగ్ధమైన కలప ఎవరిది కానప్పుడు ఫిర్యాదుదారు ఎవరు? కేసులు ఎవరి మీద నమోదు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ప్రశ్నకు జవాబు లేదు.
గ్రామ శాంతి భద్రతలకు సంబంధించిన కోణంలో పోలీసులు పూర్తి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అమాయకులైన గ్రామస్తుల పై గతంలో మైనర్ బాలికను ను కిడ్నాప్ గురైన బాలిక తండ్రిని గల్ఫ్ లో ఉద్యోగం చేస్తుండగా తండ్రి విజ్ఞప్తి మేరకు స్థానిక యువత పోలీసులకు ఫిర్యాదు చేసి బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తులపై ఫోక్సో కేసు నమోదు చేయించి కీలకంగా వ్యవహరించారు. అందుకే ఇప్పుడు తమపై కలప దగ్ధం కేసు మతకల హలు రెచ్చగొట్టే కేసును నమోదు చేయడానికి ఒకరిద్దరూ వీడీసీ సభ్యుల సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారూ కొందరు రాజకీయ నాయకులు తమను బెదిరింపులకు పాల్పడి తమను కటకటాల పాలు చేయాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని గ్రామంలోని యువత వాపోతున్నారు. ఏమైనాప్పటికిని ఈ విషయంలో జిల్లా పోలీస్ అధికారి సాయి చైతన్య జోక్యం చేసుకొని వాస్తవాలు తెలుసుకొని తప్పుడు కేసులు అడ్డుకొని అమ్మకు రక్షణ కల్పించాలని గ్రామ యువకులు కోరుతున్నారు.
చంపేస్తానని బెదిరిస్తున్నరు
గతంలో వాహన కిరాయి విషయమై జరిగిన ఒక వివాదంతో తాజోద్దీన్ అనే వ్యక్తి అతని సం బంధించిన వ్యక్తులు నన్ను వెంటాడుతున్నారు. గ్రామంలోని రామ్ మందిరంలోకి వచ్చి నన్ను చంపేస్తానని బహిరంగంగా హెచ్చరించాడు. అక్రమ కల్ప విషయమై ఫిర్యాదు చేసినందుకు నాపై కక్ష కట్టి నన్ను నీడలా వెంటాడుతున్నారు. నాకు గాని నా కుటుంబ సభ్యులకి గాని ఏమైనా జరిగితే వారే బాధ్యులు. ఆర్ అండ్ బి చెట్లను నరికి ఆ కల్పన అక్రమంగా నిలువ ఉంచుతున్నారు. గ్రామంలో జరిగిన ఒక ఫోక్సో కేసు విషయంలో మైనర్ బాలిక తరపున ఉన్నానని కూడా నాపై కక్ష సాధిం పులకు గురి చేస్తున్నారు. గ్రామంలో అక్రమంగా కల్ప నిలువ ఉంది. ఈ కలప కు ప్రత్యేకించి ఎటువంటి అనుమతులు లేవు ఈ కల్పను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకోవాల్సిందిగా అటవీశాఖ అధికారులు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
బైసా నాగరాజు తిరుమనపల్లి గ్రామస్తుడు