జహీరాబాద్ సీపీఐ డివిజన్ కార్యదర్శి కె.నర్సిములు డిమాండ్
జహీరాబాద్,(విజయక్రాంతి): జహీరాబాద్ పట్టణంలో వివిధ వార్డులో మునిసిపల్ నాలలు, అసైన్డ్ భుముల్లో ప్రభుత్వ స్థలలో అక్రమ కట్టడాలను నిర్మించిన వాటిని హైడ్రా ద్వారా కూల్చి వేయాలని సీపీఐ డివిజన్ కార్యదర్శి కె. నర్సిములు డిమాండ్ చేశారు. పట్టణంలో పెద్ద పెద్ద బడా నాయకులు అక్రమ కట్టడాలు నిర్మించారు. గతంలో మునిసిపల్ ను పరిపాలించిన బడా నాయకులు కూడా అసైన్డ్ భూములో అక్రమ కట్టడాలు నిర్మించారు పెద్ద నాలల పై పెద్ద పెద్ద గా ఇండ్లు నిర్మించి అక్రమ కట్టడాలు కటారని దానివలన పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. వారి అక్రమ కట్టడాలు ఎక్కడ బయట పడుతాయోనని ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతూ వారి అక్రమ ఆస్తులు కపడుకోవడానికి వారి ఉనికి చాటు కోవడానికి పార్టీలు మారుతున్నారని ఆయన అన్నారు.
ఎవ్వరు ఎన్ని కుయూక్తులు చేసిన అక్రమా నిర్మల నుండి తప్పించు కోలేరని అట్టి అక్రమాలకు సంబందించిన సమాచారన్ని అతి తొందరలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో బయటకు తిస్తామని ఆయన అన్నారు. బడనాయకుల అండ తో అసైన్డ్ భూములు అక్రమనకు గురవుతు ఉన్న ఎవ్వరు పాటించు కోవడం లేదని అందుకే వారు దర్జాగా ఎలుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభత్వం హైడ్రా ద్వారా అక్రమ కట్టడాలను కులుస్తున్నారో జహీరాబాద్ పట్టణంలో కూడా అక్రమ కట్టడాలు హైడ్రా ద్వారా కూల్చివేసి ప్రభుత్వ స్థలాలను మరయూ నాలల ను అసైన్డ్ భూములను కాపాడాలని ఆయన అన్నారు.మరి కొందరు వెల్ చెరులు వేసుకొని అసైన్డ్ భూములో నుండి రోడ్లు వేసుకున్నారు.వాటి అక్రమనలపై పోరాడుతామని ఎవ్వరు ఎవ్వరు అక్రమ కటాడలు నిర్మించారో వారి సమాచారం జిల్లా కలెక్టర్ గారికి అందిస్తామని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.