కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య గురువారం కూల్చివేశారు. కాగజ్ నగర్ బస్టాండ్ సమీపంలోని సర్వేనెంబర్ 143లో మున్సిపల్ నైట్ షెల్టర్ కొరకు కేటాయించిన ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన బేస్ మెంట్, రోడ్డును ఆక్రమించి చేపట్టిన షెడ్ తోపాటు ఇట్టి భూమిలో రోడ్డును ఆక్రమించే నిర్మించిన నిర్మాణాన్ని తొలగించారు. ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలు ఉల్లంగించినట్లైతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్, మున్సిపల్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.