21-02-2025 12:40:17 AM
నాగారం, ఫిబ్రవరి20 : ఇసుక అక్రమ రవాణా చేస్తూ కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ , జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. జాజిరెడ్డి గూడెం మండలం మూసి వాగులోని ఇసుక రీచ్ తుంగగూడెం మన ఇసుక మన వాహం స్యాండ్ రీచ్ లను తనిఖీ చేశారు.
మాట్లాడుతూ మూసి వాగు లోని ఇసుకను మంజూరి చేసిన ప్రాజె క్టులకు సక్రమంగా వెళుతుందా జిపిఎస్ ద్వార పరిశీలించారు. జిపిఎస్ ట్రాకింగ్ సిస్టం ను సంబంధిత తహశీల్ ఆఫీస్ మైనింగ్ ఆఫీస్ లో ప్రత్యేకంగా పర్యవేక్షించాలని తెలిపారు.
ఇసుక రీచ్ నుండి పంపే సమయంలో సీసీ కెమెరాల ముందు కొలతలు చేయాలని వెళ్ళేటప్పుడు రిజి ష్టరులో సమయం తేదీ వాహనం నెంబర్లు వివరాలు పోలీస్ రెవిన్యూ మైనింగ్ శాఖలు తని ఖీలు చేయాలని చెప్పారు.
ౠరీచ్ లలో సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం అనుమతులు ఉన్నా ఇసుక రీచ్‌లలో అనుమతించిన వాహనాలు ఇసుకను తీసుకువెళ్లాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే వెంటనే వారి వాహనాలను సీజ్ చేసి వాహనం యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.