15-03-2025 12:52:31 AM
పట్టించుకోని అధికారులు లింగంపల్లి టు మాడిపల్లి
కోనరావుపేట, మార్చి 14: అనుమతి పేరిట అక్రమదారులు ఇసుక దందాను సాగిస్తున్నారు. మండల పరిధి దాటి ఇసుక అక్రమ రవాణా చేసి కాసులు దండుకుంటున్నారు. ఇదంతా అధికారులు తెలిసిన పట్టించుకోవడం లేదు. వివరాల్లోకి వెళితే.. కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో మూలవాగులో రెవెన్యూ అధికారులు ఇసుక అనుమతి ఇచ్చారు.
అలాగే వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలోని మూలవాగులో కూడా రెవె న్యూ అధికారులు ఇసుక అనుమతి ఇచ్చా రు. ఈ క్రమంలో ఇదే అదునుగా బావించిన ఇసుక అక్రమదారులు తమ ఇష్టారీతిన ఇసుక ట్రాక్టర్లను నడిపించారు. అధికారులు మాత్రం గ్రామంలోని సీసీ రోడ్లకు, అనుమతి ఉన్న ఇండ్లకు ప్రభుత్వానికి డీడీలు కడితే మాత్రమే అనుమతి ఇచ్చారు.
కానీ కొందరు ఇసుక అక్రమదారులు అనుమతి పేరిట ఇతర గ్రామాలకు ఇసుక రవాణా చేశారు. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ కూడా మాకెందుకులే అని వదిలివే శారు. ప్రధానంగా కోనరావుపేట మండలానికి వరిగ్రామమైన మామిడిపల్లికి, వేముల వాడ రూరల్ మండలానికిచివరి గ్రామామైన లింగంపల్లి నుండి ఇసుక అక్రమదారులు ఇసుకను తరలించారు.
అనుమతి ఉన్న చోటనే ఇసుక ట్రాక్టర్ లోడ్ చేసుకుని హన్మజీపేట గ్రామం మీదుగా మామిడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఇండ్లకు ఇసుకను తరలించారు. సాధారణ రేటు కంటే ఎక్కువగా పైసలను దండుకుంటూ ఇసుకను తరలించారు. రెండు మండలాల వారధి తక్కువగా ఉండి ఇటు ఎవ్వరు రారూ అని భావించి ట్రాక్టర్ యాజమానులు ఇసుకను తరలించారు.
అధికారు లు మాత్రం అనుమతి ఇచ్చాం ఎటూ తరలించినా మేకేంమని వదిలేశారు. కానీ అక్రమార్కుల ఆగడాలు ఆపడం లేదని ఆయా గ్రామాలకు చెందిన గ్రామస్తులు వాపోతున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.