calender_icon.png 19 April, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగని ఇసుక దందా

11-04-2025 09:42:44 PM

ధర్మ కాంటా పేరుతో అక్రమ ఇసుక తరలింపు..

ఇసుక రీచ్ లో ఎక్కువ పోయడం కంటాల వద్ద తీయడం.. 

తీసిన ఇసుక దళారుల సహాయంతో అక్రమ రవాణా.. 

లారీ డ్రైవర్లకు డబల్ లోడింగ్ చార్జీలు.. 

చర్ల (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక దందాకు చెక్కు పెట్టినప్పటికీ ఆగని ఇసుక దందా ,నూతనంగా ప్రవేశపెట్టిన ఇసుక నియమ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇసుక అక్రమ దందాకు తెర తీస్తున్నారు కొందరు ఇసుకాసురులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  చర్ల మండలం సుబ్బంపేట  పరిధిలో గల  ఓ ప్రముఖ ధర్మ కాంటా  వద్ద నుంచి  అక్రమ ఇసుక తరలిపోతుంది. ఓ విధంగా ఇది కొత్తరకం ఇసుక దందా అని చెప్పవచ్చు. ఇసుక రీచ్ ల నుంచి ఇసుక లారీలలో అధిక లోడింగ్ తో ఎక్కువగా వచ్చిన ఇసుకను ధర్మ కాంటాల వద్దకు తీసుకొస్తుంటారు. అక్కడ ఎక్కువగా ఉన్న ఇసుకను జెసిబి సహాయంతో తోడి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అక్రమాలకు పాల్పడుతున్నారు. 

చర్ల మండల వ్యాప్తంగా ఇదే దందా కొనసాగుతోంది. చర్ల రీచ్ ల నుండి వెంకటాపురం వరకు రోడ్లకు ఇరువైపులా వృధాగా పడి ఉన్న ఇసుక కుప్పలు అడుగ అడుగున కనిపిస్తున్నాయి. ఎంతో విలువైన ఇసుక ఇలా రోడ్లకు ఇరువైపులా కుప్పలు కుప్పలుగా పడి ఉండటం చూస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండి పడుతుందో అర్థం అవుతుంది, దీనంతటికి కారణం రీచ్ లలో అధిక ఇసుక లోడ్ చేస్తూ లారీ డ్రైవర్లు రోడ్ల పక్కన ఎక్కువ వచ్చిన ఇసుకను తోడువేస్తూ రోడ్లకు ఇరువైపులా వేస్తున్నారు, కొందరు లారీ డ్రైవర్లు అధికంగా ఇసుక లోడ్ చేస్తున్నట్లు రిచ్ లలో లోడ్ చేసినందుకు డబ్బులు చెల్లిస్తున్నామని ధర్మ కంటాల వద్ద రోడ్డు తగ్గించేందుకు ఇసుకను తీస్తున్నప్పుడు కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కొందరు లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక రీచులలో ఇష్టానుసారంగా అధికలోడు కావాలని వేస్తున్నట్లు కొందరు లారీ డ్రైవర్ల ద్వారా సమాచారం, ఇసుక వృధాగా రోడ్లపై ఉండడంతో ఇసుకరీచులలో పరిమితులు మించి ఇసుక తోడుతున్నట్లూ స్పష్టంగా అర్థం అవుతుంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.