calender_icon.png 26 December, 2024 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా ఇసుక రవాణా

25-12-2024 12:00:00 AM

కోనరావుపేట, డిసెంబర్ 24: అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ శివారులోని మూలవాగు నుంచి ఇసుకను అనుమతుల పేరిట రవాణా చేస్తున్నారు. కథలాపూర్ మండలంలోని కలికోట రిజర్వాయర్ పను లకు ఇక్కడి అధికారులు ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చారు. నిబంధనల మేర ఇసుక రవా ణా చేయాల్సి ఉండగా, కొందరు వ్యక్తులు అనుమతులను అడ్డం పెట్టుకోని అక్రమ దందాకు తెరలేపారు.

అనుమతులు తీసుకోని, టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తుండగా, కొన్నింటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనల మేరకు ఉదయం గంటల నుంచి సాయంత్రం  గంటల వరకు ఇసుకను మూలవాగు తరలించాల్సి ఉండగా, ఉదయం 5 గంటల నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతి రోజు రాత్రి పూట వెళ్లిన ఇసు క టిప్పర్లు అక్కడే ఉండి, ఉదయం పూట ఇసుకను లోడు చేసుకోని ఇతర ప్రాంతాలకు తరలిస్తు న్నట్లు తెలిసింది.

అందులో భాగంగా మంగళవారం ఉదయం పూట సమయాని కంటే ముందే ఇసుకను తీసుకువెళ్లుతున్న రెండు టిప్పేర్లను సీజ్ చేసి, పోలీస్ స్టేషన్కు ఎస్సు ప్రశాంత్ రెడ్డి తరలించారు. కొద్ది రోజులుగా కథలాపూర్కు ఇసుకను తరలిస్తూనే, చందుర్తి, రుద్రంగి మండ లాలతో పాటు వేములవాడ ప్రాంతాలకు అనుమతుల పేరిట అక్రమ రవాణా చేస్తన్నారు. అయితే పొద్దున పట్టుకున్న టిప్పర్లను సాయంత్రానికి వదిలిపెట్టడంపై చర్చనీయాంశంగా మారింది.