11-12-2024 12:51:11 AM
నాలుగు ట్రాక్టర్లు, లారీ సీజ్
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 10, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని మొర్రెడు వాగు నుంచి అక్రమం గా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు, ఒక లారీని పాల్వంచ రెవె న్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశా రు. ఇటీవల విజయక్రాంతిలో ప్రచురితమైన యథేచ్ఛగా ఇసుక దందా కథనానికి రెవె న్యూ యంత్రాంగం కదిలింది.
అనుమతులు లేకుండా వాగుల నుంచి ఇసుకను తరలిస్తున్న వాహనాల ను సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా పాల్వంచ తహసీల్దార్ వివేక్ .. మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరం గా చర్యలు తప్పవని హెచ్చరించారు.