calender_icon.png 10 March, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా ఇసుక అక్రమ రవాణా!

10-03-2025 12:23:30 AM

చోద్యం చూస్తున్న అధికారులు 

చర్ల,మార్చి 9 (విజయ క్రాంతి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల మండలమైన చర్లలో జోరుగా ఇసుక అక్రమ రవాణా ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించిన అధికారులు ఆదేశాలను బేఖాతలు అందుకు చర్లలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా అసలే అక్రమ రవాణా అంటే ఇసుక నిల్వలకు ప్రభుత్వ భూమిని ఎంచుకోవడం గమనార్హం. మండల కేంద్రం లో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూముల్లో ఇసుక రాశులు దర్శనమిస్తున్నాయి. గొల్లగట్ట ఏరియాలో సిపిఎం పార్టీ కార్యాలయం వెనుక ప్రాంతంలో  ప్రభుత్వ భూమిలో ఇసుక నిల్వలు ఉన్న అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటే అక్రమార్కులకు అధికారుల అండదండలు ఏ మేరకు ఉన్నాయో తేటతెల్లమవుతుంది.

నిత్యం ఇసుక ట్రాక్టర్ల ద్వారా కొందరు అక్రమ రవాణా కు తి లాకీస్తున్నారు, తప్ప అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతు న్నారని ఆరోపణలు వెలబడుతు న్నాయి. నిత్యం వందల సంఖ్యలో ట్రక్టర్ల ద్వారా ఇసుక రవాణా అవుతూనే ఉన్నాయి. స్థానికంగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణాకు తెరలేపినట్టు తెలుస్తోంది. వారే ఇసుక నిల్వలు చేసి రాత్రి వేళల్లో ఇతర జిల్లాలకు తరలిస్తున్నట్లు సమాచారం. అసలే మండలంలో గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోయి వేసవిలో నీటి ఎద్దడి తాండవిస్తున్న వేళ ఇసుక అక్రమ రవాణాను అరికట్టకుంటే నీటి ఎద్దడి ఏర్పడడం తథ్యం. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.