కోరుట్ల, డిసెంబర్31 : ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, పాలసీ ప్రకారము ఇసుక రవాణాను జరపాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మల్లాపూర్, మెట్ పెల్లి మండలాల్లోని ఇసుక రి వాగులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మల్లా పూర్ మండలం సాతారం గ్రామం, మెట్పెల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో ఉన్న వాగులను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాలసీ ప్రకారం మాత్రమే ఇసుక రవాణా జరగాలన్నారు. అక్రమ ఇసుక రవాణా జరగకుండా పక్కాగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి భద్రత ఏర్పాటు చేయాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు. ఏర్పాటు చేసిన ఇసుక రి’ల ద్వారా మాత్రమే ఇసుక రవాణా చేయాలన్నారు. అలాగే తహసీల్దార్లు, సిబ్బంది అక్రమ ఇసుక రవాణా జరగకుండా ఎప్పటికపుడు నిఘా ఉంచాలని ఆదేశించారు.
అలాగే అధికారుల సమన్వయం చేసుకుంటూ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు పట్టుకుని సీజ్ చేయాలని అధికా రులకు సూచించారు. కలెక్టర్ వెంట మెట్పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్, జిల్లా మైనింగ్ అధికారి జైసింగ్, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులున్నారు.