12-03-2025 09:38:29 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లుగా, లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు. పోలీస్ల కథనం ప్రకారం లక్ష్మీదేవిపల్లి మండలం లోని అనీశెట్టిపల్లి గ్రామం లోని, ముర్రేడు వాగు నుంచి బుధవారం అక్రమంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు,మాటువేసి ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లుగా ఎస్సై తెలిపారు. పట్టుకున్న ట్రాక్టర్ డ్రైవర్, ఓనర్ పై కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. మండలంలో అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా ముర్రేడు వాగు నుంచి ఇసుకను తరలిస్తే,కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ముర్రేడు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే తనకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ రమణారెడ్డి పాత్రికేయులకు తెలిపారు.