calender_icon.png 26 March, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంగల్ పల్లిలో అక్రమంగా మట్టి తరలింపు

25-03-2025 10:56:47 PM

రెండు టిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించిన ఇబ్రహీంపట్నం పోలీసులు..

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు మట్టి టిప్పర్ లారీలను ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండల పరిధి మంగల్ పల్లిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వెనక ప్రభుత్వ భూమిలో నుండి మంగళవారం మధ్యరాత్రి జెసిబితో మట్టిని త్రవ్వి టిప్పర్లలో మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారనీ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఓనర్ దండుగుల కృష్ణ వద్ద ఇద్దరూ లారీ డ్రైవర్లు ఆంజనేయులు, వరికుప్పల బిక్షపతిలు పని కోసం వచ్చారని, దండుగుల కృష్ణ సూచన మేరకు మట్టిని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.