11-03-2025 12:23:29 AM
టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు
కడ్తాల్, మార్చి 10 (విజయక్రాంతి): కడ్తాల్ మండలంలోని అన్మాస్పల్లి గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 321/1 ప్రభుత్వ భూములో ఈ నెల 9న రాత్రి సమయంలో పుల్లేరు బోడు తండా కు చెందిన నేనవత్ శ్రీను గానుగు మర్ల తాండకు చెందిన మునవత్ శీను కలిసి 4 టిప్పర్లు ఒక జెసిబి సాయంతో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తీసి దొంగతనంగా తరలిస్తునన్నారని అన్మాస్ పల్లి గ్రామస్తుల సమాచారం మేరకు కడ్తాల్ పోలీసులు వెళ్లి అక్కడే మరో లోడుకు సిద్ధంగా ఉన్న నాలుగు ట్రిప్పర్ లను జెసిపిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి జెసిబి డ్రైవర్ పైన టిప్పర్ డ్రైవర్ల పైన వారి యజమానులైన మునవాత్ శ్రీను, నేనవత్ శ్రీను ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్త్స్ర వరప్రసాద్ తెలిపారు.