calender_icon.png 10 January, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ పదోన్నతులపై సమీక్షించాలి

09-01-2025 12:00:00 AM

విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): ట్రాన్స్ కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్ సంస్థల్లో అక్రమ పదోన్నతులపై సమీక్షించాలని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమారస్వామి, ముత్యం వెంకన్నగౌడ్ డిమాం డ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వర య్య భవన్‌లో నిర్వహించిన బీసీ ఉద్యోగుల మహాసభలో వారు మాట్లాడారు. హైకోర్టు, సుప్రీంకో ర్టుతో పాటు ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా వేలాది మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారని ఆరోపించారు. దీంతో బీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు.