calender_icon.png 16 November, 2024 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో అక్రమంగా ఉన్న పిడిఎస్ బియ్యం పట్టివేత

16-11-2024 01:04:09 PM

మంథని (విజయ క్రాంతి): మంథని పట్టణంలోని శ్రీ పాద కాలనీలో ఒకరి ఇంట్లో ప్రభుత్వ ప్రజా పంపిణీ చేసే రేషన్ (పిడిఎస్) బియ్యం అక్రమంగా కలిగి ఉన్నాడని అందిన సమాచారం మేరకు 16 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నమని, మంథని ఎస్ఐ డేగ రమేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తనకు నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులతో మంథని లోని శ్రీ పాద కాలనీలో బోగే సర్వేశ్ ఇంట్లో తనిఖీ చేయగా 40 ప్లాస్టిక్ బ్యాగులలో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన పిడిఎస్ బియ్యం 16 క్వింటాళ్లు అక్రమంగా నిల్వ ఉంచారని, ఈ బియ్యాన్ని పిడిఎస్ బియ్యంగా నిర్ధారించుకుని, ఈ  బియ్యం గురించి బొగే సర్వేశ్ ను ప్రశ్నించగా మంథని మండలంలోని చుట్టుపక్క గ్రామాల రేషన్ కార్డు లబ్ధిదారుల నుండి, రేషన్ డీలర్ అయిన గుండా ధనలక్ష్మి నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని మహారాష్ట్రలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు మంథని చెందిన గుండా ధనలక్ష్మి తన రేషన్ డీలర్ షాప్ నుండి 7 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా తనకు అమ్మిందని సర్వేశ్ తెలియజేశారని, దీంతో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మంథని మండలంలో ఎవరైనా పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన, అమ్మిన వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.