అడిగినంత డబ్బులిస్తే లేని ఇంటికి నెంబర్..
అమాయకుల టార్గెట్ చేస్తున్న ముఠా..
అక్రమ ఇంటి నెంబర్ తీసు "కొన్న" వారిపై చర్యలేవీ..?
లేని ఇంటికి నెంబర్ ఇవ్వడంపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశం
అక్రమార్కులైన అధికారుల, సిబ్బందిని మందలించి వదిలేసిన వైనం
జగిత్యాల, (విజయక్రాంతి): జిల్లా కేంద్రం జగిత్యాల బల్దియాలో అక్రమ మ్యుటేషన్ల దందా ఆగకుండా"కొన"సాగుతుంది. అడిగినంత డబ్బులిస్తే సంపా"ధన" రుచి మరిగిన బల్దియా అధికారులు, సిబ్బంది లేని ఇంటికి నెంబర్ ఇచ్చేస్తుందటంతో కొందరు అమాయకుల టార్గెట్ చేసి అక్రమ ఇంటి నెంబర్ తీసు "కొన్న" వారిపై చర్యలేవీ..? అనే ప్రశ్నలకు జవాబు దొరక్క ట్లేదటా..! పూర్తి వివరాల్లోకి వెళితే జగిత్యాల కేంద్రంలోని ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు వెంటనే కబ్జా చేసేస్తున్నారు. దొంగ డాక్యుమెంట్ సృష్టించి తక్కువ ధరకు మరొకరికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. భూముల రేట్లు అమాంతం పెరగడంతో అక్రమార్కులు ఖాళీగా కనిపించిన భూములు కబ్జాలు చేస్తున్నారు. అక్రమ మోటిషన్ల ద్వారా వెనువెంటనే రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ భూ యజమానులను భయభ్రాంతు లకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
డబ్బులు చెల్లిస్తే చాలు ఏ భూమికైనా ఇంటి నెంబర్ ఇవ్వడానికి మున్సిపల్ అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉంటారు. ఒకే స్థలానికి రెండు ఇంటి నెంబర్లు, లేని స్థలాలకు ఇంటి నెంబర్లు ఇవ్వడం జగిత్యాల మున్సిపల్ పరిధిలో మాత్రమే సాధ్యమవుతున్నట్లుంది.కాయ కష్టం చేసి రూపాయి రూపాయి పోగు చేసు"కొన్న" మధ్య తరగతి ఒక ఇంటి వారు కావాలని కలలతో స్థలంలోని ఆస్థానంలో ఇంటి నిర్మాణం చేయడానికి డబ్బులు సరిపోక రోజువారి పనులలో నిమగ్నమై ఉండగా కొందరు కబ్జాకోరులు ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి అక్రమ మోటేషన్ల ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తయారు చేసుకుని ఆ స్థలంలో కబ్జాకు వెళ్లి అసలు భూమి యజమానులను భయభ్రాంతు లకు గురిచేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు.లేని ఇంటికి నెంబర్ ఇచ్చిన జగిత్యాల మున్సిపల్ కమిషనర్, సిబ్బందిని సైతం జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.
గత కొన్నేళ్ల నుండి ఏసీబీ కొందరు అధికారుల రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసులు చేసినా కాసుల కోసం అధికారుల, సిబ్బంది కక్కుర్తి ఏ మాత్రం తగ్గకుండా కొనసాగుతుంది. జగిత్యాల మున్సిపల్ ఉద్యోగుల్లో మార్పు రాకపోగా డబ్బులు చెల్లిస్తే ఏ పనైనా చేయడానికి సిద్ధంగా అన్నట్లు గానే వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జగిత్యాల పట్టణ కేంద్రంలోని మహాలక్ష్మి నగర్లో ఇల్లు నిర్మాణం లేకున్నా ఇల్లు ఉన్నట్లు చూపిస్తూ ఇంటి నెంబర్ తీసుకోవడాన్ని ప్రశ్నిస్తూ ఒక యువకుడు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ లేని ఇంటికి నెంబర్ ఇచ్చిన మున్సిపల్ అధికారుల, సిబ్బంది తీరుపై విచారణకు ఆదేశించారు.
అయితే అక్కడ ఎలాంటి నిర్మాణం లేదని తేలడంతో అక్రమ ఇంటి నెంబర్ ని రద్దు చేశారు. అక్రమంగా ఇంటి నెంబర్ తీసుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. మున్సిపల్ వారిని తప్పుదారి పట్టించి అక్రమంగా ఇంటి నెంబర్ పొందిన వారిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనే జగిత్యాల జనం ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు మారిన అధికారుల తీరులో ఎలాంటి మార్పు రావడం లేదని, అధికారుల తీరు ఇలాగే కొనసాగితే జనం తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవని పలువురు హెచ్చరిస్తుందటం గమనార్హం.