19-03-2025 12:50:39 AM
చేవెళ్ల, మార్చి 18: మూడు వాహనాల్లో అక్రమంగా గోవులు, ఎద్దులను తరలిస్తుండగా .. హిందూ సంఘాల నేతలు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం.. షాబాద్ మండలంలోని సర్దార్ నగర్ మార్కెట్ నుంచి బుధవారం కొందరు వ్యక్తులు మూడు వాహనాల్లో గోవులు, ఎద్దులను హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
విషయం తెలుసుకున్న బజరంగ్ దళ్, ఏబీవీపీ, బీజేవైఎం నేతలు వారిని చేవెళ్ల పట్టణ పరిధిలోని షాబాద్ చౌరాస్తాలో పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే అక్కడికి చేరుకొని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వాహనాల యజమానులపై కేసులు నమోదు చేయడంతో పాటు మూగజీవాలను నార్సింగ్ పరిధిలోని గోషాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వాహనాలను పట్టుకున్న వారిలో బజరంగ్ దళ్, బీజేవైఎం, ఏబీవీపీ నేతలు అనిల్ కుమార్, గణేష్ యాదవ్, రాఘవేంద్ర చారి , మధు సూదన్, జయ సింహ, కావలి శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.