15-03-2025 12:00:00 AM
యాచారం, మార్చి 14: హోలీ పండుగ రోజున మద్యం షాపులు తెరిచి ఉండకూడదని నిర్దిష్టంగా ఆదేశాలు ఉన్నా యధావిధిగా హోలీ పండుగ రోజు కూడా ఓ బెల్టు షాపు నిర్వాహకుడు మద్యం విక్రయించాడు. సిఐ నందీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. తమ్మలోనిగూడకు చెందిన రాములు (55) వృత్తిరీత్యా కిరాణా షాపు నిర్వహిస్తూ బెల్టు షాపు ద్వారా మద్యం విక్రయిస్తున్నాడు.
అయితే ఈ క్రమంలో మద్యం విక్రయిస్తున్నాడన్న పక్క సమాచారం తెలుసుకొని ఎస్త్స్ర పోలీసులు రాములు కిరాణా షాపుపై దాడి చేసి సోదా చేశారు. సోదాలో పలు మద్యం సీసాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఇంపీరియల్ బ్లూ 750 ఎంఎల్ ఒక బాటిల్, కింగ్ ఫిషర్ బీర్లు 24 బాటిళ్ళు , రాయల్ స్టాగ్ ఐదు బాటిల్లో, ఐకాన్ క్యూ నాలుగు బాటిల్లో స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.