11-03-2025 08:31:56 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో మంగళవారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 24 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడినట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడిన మద్యాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు తెలిపారు. మండలంలోని ప్రజలు ఎవరూ కూడా అక్రమ మద్యం అమ్మకూడదని అమ్మినచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.