13-02-2025 12:00:00 AM
మహాజన సమితి ఆదివాసి మహిళ రాష్ర్ట కన్వీనర్ కంగాల రమణకుమారి డిమాండ్
భద్రాచలం, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మద్యం బెల్ట్ షాపులు యదేచ్ఛగా ఇష్టానుసారంగా జోరుగా జరుగుతున్నాయని తక్షణమే వాటిని నియంత్రించాలని మహాజన సమితి ఆదివాసి మహిళ రాష్ర్ట కన్వీనర్ కంగాల రమణకుమారి డిమాండ్ చేశారు.
స్థానిక అశోక్ నగర్ కొత్త కాలనీలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మద్యం విచ్చలవిడిగా లభించడం వలన గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజలు మద్యానికి బానిసై అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్యాంగ్ వార్లు, అల్లర్లు అనేక అగత్యాలకు మధ్యమే ప్రధాన కారణమని, అధికారులు దాన్ని ప్రోత్సహించటం ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఎంతో అర్థమవుతుందన్నారు. ఏజెన్సీలో గిరిజన పేరుతో గిరిజనేతరులు మద్యం వ్యాపారం చేస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘించి బినామీలు మద్యం వ్యాపారం చేస్తున్నా వారిపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని డిమాండ్ చేశారు.