calender_icon.png 23 January, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

23-01-2025 06:38:30 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కిడ్నీ రాకెట్(Kidney Racket) వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసులో ఎనిమిది మంది దళారుల పాత్ర ఉందని, సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రిలో ఆరు నెలలుగా కిడ్నీ మార్పిడి(Kidney Transplant) దందా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందాలో బెంగళూరు వైద్యుడు కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో విచారిస్తున్న పోలీసులు ఇప్పటికే ఆసుపత్రి నిర్వాహకుడు సుమంత్ తో పాటు కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడిలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో పోలీసులు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగారు. ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్(Kidney Transplant Racket) బట్టబయలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారంపై ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ బెజంశెట్టి(Dr. Nagender Bejjamshetty) నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించింది.

తదుపరి దర్యాప్తు కోసం గాంధీ ఆసుపత్రిలో బాధితులను కలవనున్నట్లు సమాచారం. కిడ్నీ మార్పిడి రాకెట్ వ్యవహరంపై డాక్టర్‌ నాగేంద్ర కమిటీ ఇవాళ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(Director of Medical Education)కి సమగ్ర నివేదికను సమర్పించనుంది. డా.నాగేంద్రర్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమటీ కీడ్నీ దాతలు, గ్రహీతలను విచారించింది. విచారణ సమయంలో దాతలు పూర్ణిమ అనే మహిళ పేరును ప్రస్తావించారని డీఎంఈ వాణి పేర్కొన్నారు. కుటుంబ ఆర్థిక కారణలతోనే కీడ్నీ మార్పిడికి ఒప్పుకున్నారని, వారు కన్నడ, తమిళం మాట్లాడుతున్నట్లు ఆమె వెల్లడించారు. కానీ అలకనంద ఆసుపత్రికి ఒక ప్లాస్టిక్ సర్జన్ కు మాత్రమే గుర్తింపు ఉందని, ప్లాస్టిక్ సర్జనే ఈ కీడ్నీ శస్త్ర చికిత్సలు చేశారా..? లేదా ఇంకేవరైన చేశారని అనే కోణంలో విచారిస్తున్నామన్నారు.