19-02-2025 11:09:50 PM
న్యూఢిల్లీ: అమెరికా నుంచి తరలిస్తున్న అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకుంటున్నట్లు పనామా ప్రకటించింది. వారందరికీ ఒక హోటల్‌లో బస ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. దాదాపు 300 మంది వలసదారులు తమ దేశానికి చేరినట్లు పనామా మంత్రి ఫ్రాంకా అబ్రెగో వెల్లడించారు. వారంతా భారత్, ఇరాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్ సహా వివిధ దేశాలకు చెందిన వారుగా వెల్లడించారు. అయితే, వారిలో 40 శాతం మంది తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మరోవైపు బహిష్కరణకు గురైన వారిని ఓ హోటల్లో బంధించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను అబ్రెగో ఖండించారు.