మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో అక్రమంగా రేషన్ బియ్యం కలిగి ఉన్నాడని అందిన సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులతో కలిసి మందాట వద్ద గల చల్ల నారాయణ ఇంట్లో తనిఖీ చేయగా 6 ప్లాస్టిక్ బ్యాగులలో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన పిడిఎస్ బియ్యం 2 క్వింటాళ్లు అక్రమంగా నిల్వ ఉంచగా పట్టుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. ఇట్టి బియ్యాన్ని పీడీఎస్ బియ్యంగా నిర్ధారించుకుని బియ్యం చల్ల నారాయణ ను ప్రశ్నించగా రేషన్ కార్డు లబ్ధిదారుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని రాచర్ల రమేష్ అను వ్యక్తికి లాభానికి విక్రయిస్తున్నట్లు తెలిపాడనీ దీంతో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామని, మంథని మండలంలో ఎవరైనా పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన అమ్మిన వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.