calender_icon.png 24 September, 2024 | 5:58 PM

అక్రమంగా మట్టి తవ్వకాలు

24-09-2024 01:28:36 AM

చోద్యం చూస్తున్న అధికారులు 

పట్టించుకోని పోలీసులు

తరిగిపోతున్న మట్టి గుట్టలు

ఖమ్మం, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): మైనింగ్ అధికారుల నిర్లక్ష్య ంతో ఖమ్మం జిల్లాలో మట్టి దందా జో రుగా సాగుతున్నది. అక్రమంగా తవ్వకాలు జరిపి కోట్లు దండుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యా డు. రఘునాథపాలెం, క ల్లూరు మండలాల్లో ని మట్టి గుట్టలు అక్రమార్కుల చేతిలో చిక్కి తరిగిపోతున్నాయి. ఈ తతంగమంతా పోలీసులు, మైనింగ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు ఆ రోపణలొస్తున్నాయి. మట్టి మాఫియా కింగ్ గా పేరున్న ఓ వ్యక్తి పెద్ద ఎ త్తున మట్టి తోలకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నా యి. 

పొలాల్లో మట్టి తవ్వకాలు 

రఘునాథపాలెం మండలంలోని మట్టి గుట్టలు, పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. రోజు లక్షలాది రూపాయల విలువైన మట్టి తోలకాలు జరుగుతున్నాయి. దీంతో రఘురనాథపాలెం చుట్టు పక్కల ఉన్న మట్టి గుట్టలన్నీ తరిగిపోతున్నాయి. రాత్రి సమయాల్లో టిప్పర్లు, ట్రాక్టర్లు ద్వారా మట్టి తోలకాలు చేస్తున్నారు. 

తవ్వకాలపై గ్రామస్థుల ఆగ్రహం

ఇటీవల పలు గ్రామాల ప్రజల నుంచి ఒ త్తిడి రావడంతో పోలీసులు మట్టి మాఫియా కు సంబంధించిన కొన్ని టిప్పర్లును పట్టుకున్నారు. ఆ తర్వాత యథాపరిస్థితి నెలకొన్న ది. ఎవరైనా ప్రశ్నిస్తే తమ వెనక బడాబాబు లు ఉన్నారంటూ మట్టి మాఫియా బెదిరింపులకు పాల్పడుతున్నది. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా ఎవరూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలేదు. 

ఖాన్‌పేటలో..

సత్తుపల్లి నియోజవకర్గంలోని కల్లూరు మండలం ఖాన్‌పేట గ్రామ పరిధిలోని మట్టి గుట్టలను తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లు ద్వారా తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుం డానే ఈ తతంగమంతా జరుగుతోంది. అధికారులుగానీ, పోలీసులుగానీ ఎలాంటి చర్య లు తీసుకోవడం లేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.